అక్షరాస్యత పెంచడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-16T04:19:27+05:30 IST

జిల్లాలో అందరినీ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా ‘అక్షర చైతన్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

అక్షరాస్యత పెంచడమే లక్ష్యం

రాష్ట్రంలోనే మొదటగా ‘అక్షర చైతన్యం’ ప్రారంభం

కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అందరినీ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా ‘అక్షర చైతన్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్‌  చక్రధర్‌బాబు తెలిపారు. ఆగస్టులో ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబరులో ముగుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, 1.33 లక్షల మందికి  శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో చక్రధర్‌బాబు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. నిరక్షరాస్యుల కోసం జిల్లాలోనే ప్రత్యేక పుస్తకాలను రూపొందించామని, శిక్షణకు వస్తున్న వారందరికీ పలకలు, పెన్నులు, పుస్తకాలను ఉచితంగా అందజేశామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు నిరక్షరాస్యులకు చదువు నేర్పించేందుకు ముందుకొచ్చారని అన్నారు. శిక్షణ తీసుకున్న వారందరికీ ఈ నెలలో పరీక్ష నిర్వహిస్తామని, కనీసం లక్ష మంది అయినా ఉత్తీర్ణులవుతారన్న నమ్మకం ఉందని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఓటీఎ్‌సపై ఒత్తిడి లేదు!


ఓటీఎ్‌సపై లబ్ధిదారులకు ఎటువంటి ఒత్తిడి లేదని, అవగాహన కల్పించడం ద్వారా వారు ముందుకొస్తున్నారని చక్రధర్‌బాబు తెలిపారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పథకాన్ని ఉపయోగించుకునేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. ఎవరైతే డబ్బులు చెల్లించారో వారందరికీ ఈ నెల 21వ తేదీన రిజిసే్ట్రషన పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. అందరి కృషితో జిల్లాలో మొదటి డోస్‌ వ్యాక్సిన పూర్తి చేయగలిగామన్నారు. వీలైనంత త్వరగా రెండో డోసును కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఒమైక్రానకు సంబంధించి జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టామని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-16T04:19:27+05:30 IST