వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-13T04:08:24+05:30 IST

కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత విద్యా హక్కుల ఐక్య వేదిక నాయకుడు సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
మాట్లాడుతున్న భారత విద్యా హక్కుల ఐక్య వేదిక నేత సుబ్బారెడ్డి

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

గూడూరు(రూరల్‌), జనవరి 12: కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత విద్యా హక్కుల ఐక్య వేదిక నాయకుడు సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో ఆ వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మంగళ వారం నిరసన దీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్రప్రభుత్వం దేశవ్యా ప్తంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఒప్పంద వ్యవసాయ చట్టం తీసుకువచ్చి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందన్నారు. కార్యక్రమంలో చిరంజీవి, హజరత్తయ్య, శివ రాంరెడ్డి, బాబు, జుల్ఫీకర్‌, వెంకటశేషారెడ్డి, చంద్రశేఖర్‌, స్వతంత్రకుమారి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T04:08:24+05:30 IST