డ్రైనేజీ కాలువపై ఆగని ఆక్రమణలు

ABN , First Publish Date - 2021-07-13T03:46:03+05:30 IST

పొదలకూరులో పంచాయతీ స్థలాల ఆక్రమణలు ఆగడం లేదు. మెయిన్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న డ్రైనేజీ కాలువ స్థలాలను వద

డ్రైనేజీ కాలువపై ఆగని ఆక్రమణలు
: డ్రైనేజీ కాలువపై అక్రమంగా నిర్మిస్తున్న కొట్లు

ఆటో స్టాండ్‌ వెనుక వైపు నిర్మాణాలు

పొదలకూరు, జూలై 12 : పొదలకూరులో పంచాయతీ స్థలాల ఆక్రమణలు ఆగడం లేదు. మెయిన్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న డ్రైనేజీ కాలువ స్థలాలను వదలడం లేదు. ఆటో స్టాండు వెనుక వైపు. యాదవవీధి ప్రారంభంలో ఇటీవల నూతన డ్రైనేజీ కాలువ నిర్మాణంలో భాగంగా అధికారులు ఆక్రమణలను తొలగించారు. కాలువ నిర్మాణం పూర్తైందో..? లేదో ఆదివారం రాత్రి నుంచే తిరిగి కొట్లు  నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈసారి ఇంకా పటిష్టంగా ఎక్కువ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదు. గతంలో బంకులు లేని స్థలంలో కూడా కొత్తగా బంకులు వెలుస్తున్నాయి. పట్టణంలో రోజురోజుకు ఆక్రమణలు పెరుగుతున్నాయి. కాలువలు, వాగులు, డ్రైనేజీ కాలువలపై ఆక్రమణలకు గురికావడంతో వరద ముప్పు   పొంచి ఉంది. ఆర్థికంగా స్థిరపడిన వారు సైతం యథేచ్ఛగా ఆక్రమణలు జరిపి అద్దెలకు ఆ కొట్లు ఇస్తున్నారు. ఆక్రమణలపై ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని యాదవవీధి ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-07-13T03:46:03+05:30 IST