ఆడుకోవాలని చూస్తే పోరాటం తప్పదు

ABN , First Publish Date - 2021-10-29T03:04:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో అడుకోవాలని చూస్తే పోరాటం తప్పదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

ఆడుకోవాలని చూస్తే పోరాటం తప్పదు
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

టీఎన్‌ఎస్‌ఎఫ్‌

వెంకటగిరి, ఆక్టోబరు 28: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో అడుకోవాలని చూస్తే పోరాటం తప్పదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాసంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి వీలుకల్పించే జీవో 42 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అమ్మవడి ఎవరడిగారు మా బడులు మాకు కావాలని విద్యార్థులు కోరుతున్నారన్నారు. విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకొని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చు కోవాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి  పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్‌, సుకుమార్‌, కార్తీక్‌, శివతేజా తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-10-29T03:04:58+05:30 IST