నేత కార్మికుడికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-02-07T03:05:45+05:30 IST

బుచ్చి కోదండరామపురంలో కిడ్నీలు దెబ్బతిని బాధపడుతున్న చేనేత కార్మికుడు బైనా రఘురామయ్య (కన్నయ్య) కు

నేత కార్మికుడికి ఆర్థిక సాయం
ఆర్థిక సాయం అందజేస్తున్న స్థానిక నేత కార్మికులు

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి6: బుచ్చి కోదండరామపురంలో కిడ్నీలు దెబ్బతిని బాధపడుతున్న చేనేత కార్మికుడు బైనా రఘురామయ్య (కన్నయ్య) కుటుంబానికి శనివారం పలువురు స్థానిక చేనేత కార్మికులు రూ. 42వేల ఆర్థిక సాయం అందజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రఘురామయ్య, కుటుంబ సభ్యులను శనివారం చేనేత కార్మికులు తాళ్ల నరసింహస్వామి, బైనా రామ్మోహన్‌, ఐలా వెంకటస్వామి, పన్ని వెంకటేశ్వర్లు గౌరవబత్తిన వెంకటేశ్వర్లు, నాపా సురేంద్ర, బైనా వెంకటశేషయ్యలు పరామర్శిఽంచి ఆర్థిక సాయం అందజేశారు.


Updated Date - 2021-02-07T03:05:45+05:30 IST