ఆదర్శప్రాయుడు జ్యోతిరావు ఫూలే
ABN , First Publish Date - 2021-11-29T02:51:36+05:30 IST
ఆదర్శప్రాయుడు జ్యోతిరావుఫూలే అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఫూలే వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.

ఆదర్శప్రాయుడు జ్యోతిరావు ఫూలే
గూడూరు, నవంబరు 28: ఆదర్శప్రాయుడు జ్యోతిరావుఫూలే అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఫూలే వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి అన్నారు. బలహీనవర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన కృషి చేశారన్నారు. అందరికి చదువు ఎంతో అవసరమని గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. అనంతరం ఫూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి నెలబల్లి భాస్కర్‌రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, నరసింహులు, చంద్రమౌళి, బత్తిన ప్రణీత్, రవీంద్రరెడ్డి, కోటేశ్వరరావు, మైనంపాటి మోహన్, భారతి పాల్గొన్నారు. సీమాంధ్ర బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో బీసీ వసతిగృహంలో శివకుమార్ తదితరులు ,విశాంత్ర ఉద్యోగుల భవనంలో ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ హరిప్రసాద్, నాశిన భాస్కర్‌గౌడ్, ఎల్‌వీసుబ్బయ్య, అన్వర్, సీవీఆర్ కుమార్, గోపాల్, భాస్కరరావు తదితరులు నివాళులర్పించారు.
నాయుడుపేట : బహుజనుల సంపూర్ణాభివృద్ధికి కృషి చేసిన మహాత్మాజ్యోతిరావుపూలే వారి ఆరాధ్యదైవమని మాజీమంత్రి డాక్టర్ పరసారత్నం అన్నారు. నాయుడుపేట మండలం గొట్టిప్రోలులో ఆదివారం జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు జువ్వలపాటి మస్తాన్, బీసీ నాయకులు నాయుడుపేటలో జ్యోతిరావుపూలే-సావిత్రిబాయిపూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ వైస్ ఎంపీపీ పరసా వెంకటరమణయ్య, పరసా రాజా, వెంకటేశ్వర్లు, కేశవులు, బీసీ సంఘ నాయకులు శివ, ప్రసాద్, షరీఫ్, చెంచుకృష్ణయ్య, సురేష్, శేఖర్, బాలాజీ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
