డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2021-11-03T04:07:49+05:30 IST
రబీ సాగుకు అవసరమైన వరి విత్తనాలను ధృవీకృత డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కన్నయ్య సూచంచారు.
ఎంటీయూ 1010 రకం వరి సాగు చేయొద్దు
అల్లూరు, నవంబరు 2 : రబీ సాగుకు అవసరమైన వరి విత్తనాలను ధృవీకృత డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కన్నయ్య సూచంచారు. ఆయన మంగళవారం స్థానిక వ్యవసాయాధికారి లలితతో కలసి ఆర్‌బీకేల్లో విత్తనాలు, ఎరువులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విత్తనాలు కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. మొలక 80 శాతం ఉంటేనే నార్లు పోసుకోవాలన్నారు. బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకాలతోపాటు ఎన్‌ఎల్‌ఆర్-145, ఎన్‌ఎల్‌ఆర్‌ర్-, ఎన్‌ఎల్‌ఆర్-4001 వేసుకోవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటీయూ 1010 రకం వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని, రైతులు ఆ రకం విత్తం సాగు చేసి ఇబ్బందులు పడవద్దన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ద్వారా బీపీటీ 5204 రకం 230 క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం 50 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్ 1504 రకం 46 క్వింటాళ్లు అందుబాటులో ఉంచామన్నారు.