చికిత్సపొందుతూ యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-22T04:50:57+05:30 IST
మండలంలోని వేణుంబాక గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై మూడురోజుల క్రితం మోటారుసైకిల్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో

దొరవారిసత్రం, అక్టోబరు 21 : మండలంలోని వేణుంబాక గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై మూడురోజుల క్రితం మోటారుసైకిల్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పి.భానుప్రకాష్(23) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడిది పెళ్ళకూరు మండలం చావాలి గ్రామం. నాయుడు పేట నుంచి సూళ్లూరుపేటకు మోటారుసైకిల్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.