భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-06-23T03:24:18+05:30 IST

భవన నిర్మాణ పనులకు వెళ్లిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడి మృతి చెందాడు.

భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి
తిరుపతి పెద వెంకటరమణయ్య మృతదేహం

అల్లూరు, జూన్‌ 22 : భవన నిర్మాణ పనులకు వెళ్లిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కావలి రూరల్‌ మండలం తాళ్లపాలెం పంచాయతీ జువ్విగుంటపాలెంకు చెందిన తిరుపతి వెంకటరమణయ్య (37) మంగళవారం తోటి కూలీలతో కలసి అల్లూరు మండలం సింగపేట పంచాయతీ కొత్తసింగపేటలో భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయంలో అందరితో కలసి భోజనం చేసిన ఆయన క్యారియర్‌ బాక్సు కడుగుతూ అప్పుడే నిర్మాణంలో ఉన్న మిద్దె పిట్టగోడకు ఆనుకున్నాడు. అది ఒరిగిపోవడంతో అతను మిద్దె పైనుంచి కింద పడి తలకు బలమైన గాయాలయ్యాయి. సహచర కూలీలు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే పెదవెంకటరమణయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లూరు ఎస్‌ఐ చిన్నబలరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-23T03:24:18+05:30 IST