రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
ABN , First Publish Date - 2021-05-06T04:06:32+05:30 IST
దగదర్తి మండలం జాతీయ రహదారి లైన్స్ నగర్ వద్ద బుధవా రం గుర్తుతెలియని వాహనం ఢీకొని కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న

మృతురాలు ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి
స్కూటీపై విధులకు వెళుతుండగా విషాదం
బిట్రగుంట/దగదర్తి 5: దగదర్తి మండలం జాతీయ రహదారి లైన్స్ నగర్ వద్ద బుధవా రం గుర్తుతెలియని వాహనం ఢీకొని కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి బందెల సంధ్య (23) మృతిచెందారు. సంధ్య నెల్లూరులో కాపురముంటోంది. లాక్‌డౌన్ కారణంగా స్కూటీపై విధులకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలిని బుచ్చి సీఐ సురేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.