జీవో 53ను పటిష్ఠంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-08-28T04:44:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కూల్లో ఫీజులకు సంబంధించి జీవో 53ను పటిష్ఠంగా అమలు చేయాలని ఏబీవీపీ నగర సహాయ కార్యదర్శి రవి పేర్కొన్నారు.

జీవో 53ను పటిష్ఠంగా అమలు చేయాలి

ఆత్మకూరు ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కూల్లో ఫీజులకు సంబంధించి జీవో 53ను పటిష్ఠంగా అమలు చేయాలని ఏబీవీపీ నగర సహాయ కార్యదర్శి రవి పేర్కొన్నారు. ఈ మేరకు ఏబీవీపీ నేతలు, విద్యార్థులు శుక్రవారం ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజే శారు. ఎంఈవో కార్యాలయం మూసి ఉండడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో నిరసన పత్రం పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవో 53ను ఏబీవీపీ స్వాగతిస్తుందని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను పొందుపరిచి అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అదే క్రమంలో మౌలిక వసతులు కొరవడిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు మహేష్‌, తిరుమల, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:44:35+05:30 IST