ఏబీవీపీ నిరసన

ABN , First Publish Date - 2021-05-03T04:36:59+05:30 IST

పరీక్షలు వాయిదా వేసే విధంగా తనయుడికి బుద్దిని ప్రసాదిం చాలని ఏబీవీపీ నేతలు ఆదివారం స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలో వైఎస్సార్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి

ఏబీవీపీ నిరసన

ఆత్మకూరు, మే 2 : పరీక్షలు వాయిదా వేసే విధంగా తనయుడికి బుద్దిని ప్రసాదిం చాలని ఏబీవీపీ నేతలు ఆదివారం స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలో వైఎస్సార్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.అశోక్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మరి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడడం తగదని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కనీసవేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర సహాయ కార్యదర్శులు నవీన్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T04:36:59+05:30 IST