విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-21T04:34:35+05:30 IST

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నిరసన దీక్ష చేస్తున్న ఏబీవీపీ నేతలు

ఏబీవీపీ నిరసన దీక్ష

నెల్లూరు (విద్య), అక్టోబరు 20 : విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్‌ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యా రంగానికి పెద్ద పీట వేస్తామని ఎన్నిక లకు ముందు చెప్పిన జగన్‌ నేడు విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించా రు. రోజుకో తుగ్లక్‌ జీవోను విడుదల చేస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నా రు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించడం అన్యాయమన్నారు. జీవో నెం 42ను రద్దు చేసి ఎయిడెడ్‌ సంస్థలను పరిరక్షించాలని కోరారు. జీవో నెం 77ను కూడా రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, జీవో నెం 55ను రద్దు చేసి విద్యాదీవెనను విడుదల చేయాలని,  నెల్లూరులో కనీసం ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌, నగర కార్యదర్శి సాయికృష్ణ, నాయకులు ఉదయ్‌, యశ్వంత్‌, మనోహర్‌, లక్షణ్‌, శివ, జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:34:35+05:30 IST