అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-07-09T02:49:25+05:30 IST
లై8: ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన పథకంతో కేంద్రం నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చే

-జడ్పీ సీఈవో సుశీల
కావలి రూరల్, జూలై8: ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన పథకంతో కేంద్రం నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ సీఈవో పి.సుశీల పేర్కొన్నారు. కావలి రూరల్ మండలం ఆర్సీపాళెం, మన్నంగిదిన్నె గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఆర్సీపాళెంలో రూ. 3 లక్షలతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను, రూ.20 లక్షలతో జరుగుతున్న సైడుకాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అనంతరం ఆర్సీపాళెం, మన్నంగిదిన్నె గ్రామాల్లో ని చెత్తశుద్ధి కేంద్రాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరించిన చెత్తను చెత్తశుద్ధి కేంద్రాలకు తరలించాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్పీడీవో ఏవీ సుబ్బారావు, డీపీఆర్సీ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్‌లు పేముల రాజేంద్ర, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.