జిల్లాలో 9 కొవిడ్ కేర్ సెంటర్లు
ABN , First Publish Date - 2021-05-09T03:51:42+05:30 IST
జిల్లాలోని 9 కొవిడ్ కేర్ సెంటర్లలో మూడువేల బెడ్లను సిద్దం చేసినట్లు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు.

పూర్తి స్థాయిలో వైద్య సేవలు
కలెక్టర్ చక్రధర్‌బాబు
నాయుడుపేట, మే 8 : జిల్లాలోని 9 కొవిడ్ కేర్ సెంటర్లలో మూడువేల బెడ్లను సిద్దం చేసినట్లు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. నాయుడుపేట - బిరదవాడ జాతీయ రహదారి సమీపంలో టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను శనివారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో వెయ్యి మందికి పైగా చికిత్స పొందుతున్నారన్నారు. ప్రతి సెంటర్‌లో వైద్య సేవలతో పాటు పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నాయుడుపేట సెంటర్‌లో 72 వైద్యసేవలు వినియోగించుకుంటున్నారన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కలెక్టర్ వెంట నాయుడుపేట ఆర్డీవో సరోజిని, ప్రోగ్రామింగ్ అధికారి దయాకర్, డ్రాయింగ్ అధికారి హరిప్రియ, నాయుడుపేట సీఐ వేణుగోపాల్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.