6 ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-31T03:40:39+05:30 IST

పెన్నానదిలో యంత్రాల తో తవ్వి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను గురువారం సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నా

6 ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం
స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లతో సెబ్‌ అధికారులు

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు30: పెన్నానదిలో యంత్రాల తో తవ్వి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను గురువారం సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మినగల్లు పెన్నానది తీరం వెంబడి ఇసుక, తవటను ఎక్సకవేటర్‌తో తవ్వి ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తుండగా, అందిన సమాచారం మేరకు నెల్లూరు జేడీ శ్రీలక్ష్మి బృందం, బుచ్చి సెబ్‌ అధికారులు కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఒక ఎక్సకవేటర్‌,  నాలుగు ఇసుక లోడు ట్రాక్టర్లు, రెండుఖాళీ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని బుచ్చి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు సెబ్‌ సీఐ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-12-31T03:40:39+05:30 IST