రూ.45 లక్షల విలువ చేసే గంజాయి కాల్చివేత
ABN , First Publish Date - 2021-12-10T04:30:57+05:30 IST
మండలంలోని చెముడుగుంట చెరువు పోరంబోకు స్థలం వద్ద రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గురువారం రూ.45లక్షల విలువ చేసే గంజాయిని కాల్చివేశారు.

49 కేసుల్లో 748.74 కిలోల స్వాధీనం
వెంకటాచలం, డిసెంబరు 9 : మండలంలోని చెముడుగుంట చెరువు పోరంబోకు స్థలం వద్ద రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గురువారం రూ.45లక్షల విలువ చేసే గంజాయిని కాల్చివేశారు. 2016 సెప్టెంబరు నుంచి 2021 అక్టోబరు వరకు జిల్లాలోని నెల్లూరు-1, నెల్లూరు-2, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, సూళ్లూరుపేట సెబ్ స్టేషన్లకు సంబంధించి 49 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 748.74 కిలోల గంజాయిని స్పెషల్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్‌సీబీ ప్రొసీజర్ ప్రకారం అధికారులు కాల్చివేయడం జరిగింది. జిల్లా సెబ్ డిప్యూటీ కమిషనర్, డ్రగ్ డిస్పోసబుల్ కమిటీ చైర్మన్ కే హేమంత్, కమిటీ మెంబర్స్ ఎస్. రవికుమార్, టీ శ్రీనివాసరావు, స్పెషల్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జేడీ కే శ్రీలక్ష్మి, ఏఎస్పీ ఎస్. కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో ఐదు సెబ్ స్టేషన్ల సీఐలు కిషోర్, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, విజయ్‌కుమార్, డీ సూర్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.