కోన నిత్యాన్నదాన పథకానికి రూ.20 లక్షలు విరాళం
ABN , First Publish Date - 2021-11-27T03:05:48+05:30 IST
పెంచలకోన క్షేత్రంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి చేజర్లకు చెందిన లక్కాకుల రత్నమ్మ , ఆళ్వార్‌శెట్టి చెంచురత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి అల్లుడు ఏపీజీబీ బ్యాంకు విశ్రాంత మేనేజరు చింతల వెంకట్రావు రూ..20లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను శుక్రవారం సాయంత్రం ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్యకు అందజేశారు.

రాపూరు, నవంబరు 26: పెంచలకోన క్షేత్రంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి చేజర్లకు చెందిన లక్కాకుల రత్నమ్మ , ఆళ్వార్‌శెట్టి చెంచురత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి అల్లుడు ఏపీజీబీ బ్యాంకు విశ్రాంత మేనేజరు చింతల వెంకట్రావు రూ..20లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను శుక్రవారం సాయంత్రం ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్యకు అందజేశారు. దాతలు ముందుగా శ్రీవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశ్వీరదించగా, ఆలయ ఏసీ శేష వస్త్రాలు, ప్రసాదాలు అందించారు. త్యాన్నదాన పథకానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందడం ఇదే తొలిసారి అని ఏసీ ప్రకటించారు.