12 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-10-30T04:20:13+05:30 IST
ఒడిస్సా నుంచి చెన్నైకు తరలిస్తున్న 12 కిలోల గంజాయిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు.

ముగ్గురు నిందితుల అరెస్టు
తడ, అక్టోబరు 29 : ఒడిస్సా నుంచి చెన్నైకు తరలిస్తున్న 12 కిలోల గంజాయిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వివరాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం భీములవారిపాళెం చెక్‌పోస్టు వద్ద చెన్నైకు వెళ్లే ఆర్టీసీ బస్సులను తనిఖీ చేస్తుండగా నెల్లూరు నుంచి చెన్నైవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన టి. బిశ్వంత్ బ్యాగులో 5 కిలోల గంజాయి, అతని స్నేహితుడు ఎం. చందన్ వద్ద 2 కిలోల గంజాయిని పట్టుకున్నాం. దాని వెనుకే వస్తున్న మరో ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఆ రాష్ట్రానికే చెందిన పి. దినబంధు బ్యాగులో మరో 5 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నాం. మొత్తం 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశాం. ఈ గంజాయితో విశాఖ నుంచి గూడూరు వరకు రైలులో వచ్చారని, అక్కడ నుంచి బస్సుల్లో చెన్నైకు వెళ్తున్నారని సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్‌ఈబీ సిబ్బంది చెంచయ్య, వేణుగోపాల్. పోలయ్య, హరిబాబు పాల్గొన్నారు.