1011 పాజిటివ్‌ల నమోదు

ABN , First Publish Date - 2021-05-03T04:43:00+05:30 IST

జిల్లాలో కరోనా ప్రభంజనం కొనసాగుతోంది.

1011 పాజిటివ్‌ల నమోదు

ఆరుగురి మృతి


నెల్లూరు (వైద్యం), మే 2 : జిల్లాలో కరోనా ప్రభంజనం కొనసాగుతోంది. ఆదివారం 1011 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక వైరస్‌ నుంచి కోలుకోలేక ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇక కరోనా నుంచి కోలుకున్న 304 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.  


ప్రభుత్వాసుపత్రుల్లో అగ్నిమాపక సిబ్బంది విధులు

నెల్లూరు(క్రైం), మే 2: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అగ్నిమాపక సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని జిల్లా అగ్నిమాపక అధికారి కే శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో జిల్లాలోని 13 అగ్నిమాపక కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కొవిడ్‌ వైద్యశాలల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగితే మంటలను ఎలా నివారించాలన్న అంశాలపై సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. ప్రైవేటు కొవిడ్‌ వైద్యశాలల సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వీరు ఎప్పటికప్పుడు ప్రైవేటు సిబ్బందితో మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తెలియజేస్తుంటారన్నారు. 

Updated Date - 2021-05-03T04:43:00+05:30 IST