ఆదర్శంగా తీర్చిదిద్దాలి: జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2021-11-24T05:22:50+05:30 IST

ప్రధానమంత్రి అవాజ్‌ గ్రామీణ యోజనా పథకం కింద గుర్తించిన మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను 2022 ఆగస్టు నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య ఆదేశించారు.

ఆదర్శంగా తీర్చిదిద్దాలి: జడ్పీ సీఈవో

కర్నూలు(న్యూసిటీ), నవంబరు 23: ప్రధానమంత్రి అవాజ్‌ గ్రామీణ యోజనా పథకం కింద గుర్తించిన మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను 2022 ఆగస్టు నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం జడ్పీ మినీ సమావేశ భవనంలో పంచాయతీరాజ్‌ కర్నూలు ఈఈ శ్రీగిరినాథ్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ప్రతాప్‌రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో టీవీ భాస్కర్‌నాయుడు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ శివశంకర్‌తో సమీక్ష నిర్వహించారు. సీఈవో మాట్లాడుతూ పీఎంఏజీవై, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జిల్లాలో ఓర్వకల్లు, కొత్తపల్లి, ఆదోని, చాగలమర్రి, గోస్పాడు, జుపాడుబంగ్లా, కొలిమిగుండ్ల, రుద్రవరం, శిరివెళ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామాల్లోన్ని ఎస్సీ కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించేలా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T05:22:50+05:30 IST