విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-10-30T04:04:42+05:30 IST

మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామ నాపరాతి గనుల్లో అదే గ్రామానికి చెందిన బత్తుల సుధాకర్‌ (21) విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

కొలిమిగుండ్ల, అక్టోబరు 29: మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామ నాపరాతి గనుల్లో అదే గ్రామానికి చెందిన బత్తుల సుధాకర్‌ (21) విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మృతుడు బత్తుల సుధాకర్‌ నాపరాతి గనుల్లో కటింగ్‌ మిషన వద్ద పనిచేస్తున్న సమయంలోప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అస్వస్థతకు గురైన సుధాకర్‌ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని, మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  


Updated Date - 2021-10-30T04:04:42+05:30 IST