రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-18T05:41:32+05:30 IST

నంద్యాల పట్టణం బొమ్మలసత్రం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై జగన్‌ (25) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

నంద్యాల(నూనెపల్లె), మే 17: నంద్యాల పట్టణం బొమ్మలసత్రం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై జగన్‌ (25) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.  వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని దళిత పేటకు చెందిన పరశురాముడు కొడుకు జగన్‌ సోమవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. సాయం త్రం ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే బొమ్మలసత్రం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దళితపేటకు చెందిన జగన్‌గా యువకుడిని గుర్తించారు. మరణ వార్తను కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు   దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-05-18T05:41:32+05:30 IST