‘ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ’

ABN , First Publish Date - 2021-08-21T05:26:03+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకపాలన సాగిస్తోందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

‘ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ’
అడివప్ప గౌడ్‌కు మిఠాయి తినిపిస్తున్న తిక్కారెడ్డి

ఎమ్మిగనూరు, ఆగస్టు 20: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకపాలన సాగిస్తోందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. కౌతాళం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు అడివప్పగౌడ్‌ను తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో శుక్రవారం ఎమ్మిగనూరులో తిక్కారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దివాకర్‌రెడ్డిలను కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సురేష్‌నాయుడు, బసవరాజుగౌడ్‌, సిద్దు, సతీస్‌, శివ, నాగరాజు, రిషి, దేవనగౌడ్‌, రామన్నగౌడ్‌, శివకుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T05:26:03+05:30 IST