వైసీపీ కాలగర్భంలో కలుస్తుంది

ABN , First Publish Date - 2021-11-22T05:12:20+05:30 IST

స్ర్తీలను అవమానించినవారు బాగుపడ్డ దాఖలాలు లేవని, తెలుగుదేశం అధినేత సతీమణి పట్ల అనుచితంగా మాట్లాడిన వైసీపీ త్వరలోనే కాలగర్భంలో కలసిపోవటం ఖాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

వైసీపీ కాలగర్భంలో కలుస్తుంది

  మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి


బండి ఆత్మకూరు, నవంబరు 21:  స్ర్తీలను అవమానించినవారు  బాగుపడ్డ దాఖలాలు లేవని, తెలుగుదేశం అధినేత సతీమణి పట్ల అనుచితంగా మాట్లాడిన వైసీపీ   త్వరలోనే కాలగర్భంలో కలసిపోవటం ఖాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.  ఆదివారం బండిఆత్మకూరు మండలంలోని రామాపురం గ్రామంలో ఓ కార్యక్రమానికి బుడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో  రెండు రోజుల క్రితం మంత్రి కొడాలి నాని, ఎంఎల్‌ఏలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్‌రెడ్డి   సభ్యసమాజం తలదించుకునేలా  వ్యవహరించారని అన్నారు.  సీఎం జగన్మోహనరెడ్డి వెనకుండి  ఈ వ్యాఖ్యలు చేయించారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించారని, త్వరలో వైసీపీకి రాజకీయ సమాధి కట్టడానికి   సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా సీఎం, వైసీపీ ఎమ్మెల్యేలు భేషరతుగా మాజీ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-11-22T05:12:20+05:30 IST