టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-10-29T04:33:20+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం శూన్యమని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు.

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
గౌరు దంపతులను గజమాలతో సత్కరిస్తున్న ఎ.గోకులపాడు నాయకులు

కల్లూరు, అక్టోబరు 28: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం శూన్యమని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారని అన్నారు. కల్లూరు మండలం ఎ.గోకులపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాచిరెడ్డి రఘునాథరెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, కురువ శేఖర్‌, కుమ్మరి పండు, బోయ పెద్ద వెంకటేశ్వర్లు, పింజరి అక్బర్‌ బాషాలతో పాటు 50 మంది వైసీపీ కార్యకర్తలు గౌరు దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు. కల్లూరు మండల మాజీ అధ్యక్షుడు బాల వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆర్‌.చంద్రకళాధర్‌ రెడ్డి, గోకులపాడు మాజీ సర్పంచ్‌ లక్ష్మీవర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులకు టీడీపీ కండువాలు వేసీ పార్టీలోకి ఆహ్వానించారు. 


Updated Date - 2021-10-29T04:33:20+05:30 IST