వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదు: టీడీపీ

ABN , First Publish Date - 2021-12-16T04:53:14+05:30 IST

వైసీపీ అరాచక పాలనకు పతనం తప్పదని ఆత్మకూరు మాజీ సర్పంచ గోవిందరెడ్డి, బాపనంతాపురం సర్పంచ దరగయ్య అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి  పతనం తప్పదు: టీడీపీ
నారాయణపురంలో మాట్లాడుతున్న కంచర్ల సురేష్‌రెడ్డి

ఆత్మకూరురూరల్‌, డిసెంబరు 15: వైసీపీ అరాచక పాలనకు పతనం తప్పదని ఆత్మకూరు మాజీ సర్పంచ గోవిందరెడ్డి, బాపనంతాపురం సర్పంచ దరగయ్య అన్నారు. బుధవారం మండలంలోని బాపనంతాపురం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం గౌరవ సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడటం దారుణమన్నారు. అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన ఘనత వైసీపీ ప్రజా ప్రతినిధులకే దక్కిందన్నారు. నవరత్నాల పేరిట రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారన్నారు. వైసీసీ దుర్మార్గ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాఽధ్యక్షులు శివప్రసాద్‌, నాయకులు పుల్లారెడ్డి, గిరిరాజు, నబీ, వెంకటరావు, వేణు, అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దీన, రామ్మూర్తి, నల్లకాలువ గోవర్ధనరెడ్డ్డి, రమేష్‌ గ్రామ టీడీపీ నాయకులు శివశంకర్‌, వెంకటేశ్వర్లు, బాబు, చిన్న కోటేశ్వరరావు మనోహర్‌ మహే్‌ష పాల్గొన్నారు. 

వైసీపీకి గుణపాఠం చెప్పండి

బండి ఆత్మకూరు: రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా వైసీపీ పరిపాలన దుర్మార్గంగా కొనసాగుతోందని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు కంచర్ల సురే్‌షరెడ్డి, మనోహర్‌చౌదరి, తాటికొండ బుగ్గరాముడు, నాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం  మండలంలోని చిన్నదేవళాపురం, నారాయణపురం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి పట్ల కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేయటం, దాన్ని సీఎం, స్పీకర్‌లు పట్టించుకోకపోవటం విడ్డూరమన్నారు.  టీడీపీ నాయకులు జాకీర్‌, నందయ్య,  ఆంబ్రోస్‌, రామచంద్రుడు, గురుపాదం, మళ్ళీశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఆత్మకూరు(వెలుగోడు): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండకట్టాలని వెలుగోడు మండల, పట్టణ అన్నారపు శేషిరెడ్డి, ఖలీలుల్లాఖాన  పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని రేగడగూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గౌరవసభలో వారు మాట్లాడారు. అసెంబ్లీ ప్రజా సమస్యలను ప్రస్తావించిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపాలన సాగిస్తూ.. అన్నివర్గాల ప్రజల్ని వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెలుగోడు మాజీ సర్పంచ అబ్దుల్‌కలాం, నాయకులు ఆసార్‌వజీర్‌, హిదాయత అలిఖాన, బందేల యతీష్‌, వంగాల కృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి, భాస్కరరెడ్డి, కంబాల మహేశ్వరరెడ్డి, రహంతుల్లా, నాగమోహనరెడ్డి, రామనాథరెడ్డి, అన్వర్‌, ప్రభాకర్‌, సుధాకర్‌, బాలరాజు ఉన్నారు.


Updated Date - 2021-12-16T04:53:14+05:30 IST