అహోబిలంలో సబ్ కలెక్టర్ పూజలు
ABN , First Publish Date - 2021-12-26T06:00:05+05:30 IST
అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామికి నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం పూజలు చేశారు.

ఆళ్లగడ్డ, డిసెంబరు 25: అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామికి నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం పూజలు చేశారు. ఈమె రాకను పురస్కరించుకొని ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఎగువ, దిగువ అహోబిలాల్లో పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.