రాఘవేంద్రుడి ఆరాధన

ABN , First Publish Date - 2021-08-22T05:20:03+05:30 IST

రాఘవేంద్రస్వామి 350వ ఆరాధన సప్తాహం శనివారం వైభవంగా మొదలైంది. తెల్లవారు జామున రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు.

రాఘవేంద్రుడి ఆరాధన
ధ్వజారోహణ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్న పీఠాధిపతి

  1.  ఉత్సవాలకు అంకురారోపణ
  2. హాజరైన అశేష భక్తజనం


మంత్రాలయం, ఆగస్టు 21: రాఘవేంద్రస్వామి 350వ ఆరాధన సప్తాహం శనివారం వైభవంగా మొదలైంది. తెల్లవారు జామున రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ కవచం, పట్టు వస్త్రాలతో అలంకరించారు. ప్రహ్లాదరాయలకు కనాకాభిషేకం, పాద పూజలు చేశారు. సాయంత్రం ధ్వజారోహణ, గోపూజ, లక్ష్మీపూజ, ధాన్యపూజ నిర్వహించారు. స్వర్ణ బృందావనం సమీపంలో కాషాయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలకు అంకురారోపణ చేశారు. యోగీంద్ర కళా మంటపంలో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రహ్లాదరాయల వారిని విశేషంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొన్నారు. 


మఠంలో రూ.3 కోట్లతో నిర్మించిన మ్యూజియం, మఠం ముందు భాగంలో రూ.90 లక్షలతో వేసిన సీసీ రోడ్డు, తులసి వనంలో భవ్య సభ భవన్నాని మఠం పీఠాధిపతి ప్రారంభించారు. రాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలలో పాల్గొనే భక్తులు కొవిడ్‌ నిబంధనలను పాటించాలని పీఠాధిపతి సుభుదీంద్రతీర్థులు కోరారు. కొవిడ్‌ మహమ్మారిని తరిమేద్దామని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.


యోగీంద్ర కళా మంటపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్వాన్‌ జగదీష్‌ పుత్తూరు వారి సంగీత లహారి, విద్వాన్‌ రఘుపతి దిన్ని వారిపిల్లనగ్రోవి కచేరి, ఉడిపికి చెందిన భార్గవి నృత్యా తాండ వారి భవ్య యోగగాన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పండిత కేసరి రాజా ఎస్‌ గిరియాచార్‌, మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌ వెంకటేశ్‌ జోషి, మీడియా ఇన్‌చార్జి ఎస్‌కే శ్రీనివాసరావు, గిరిధర్‌రావు, ద్వారపాలక అనంతస్వామి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి, సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్‌ వాదిరాజాచార్‌, శ్రీపతి ఆచార్‌, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, విజయేంద్ర ఆచార్‌, బద్రీనాథ్‌, డీఎస్పీ వినోద్‌ కుమార్‌, సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వేణుగోపాలరాజు, పోలీస్‌ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T05:20:03+05:30 IST