నూర్పిడి మిషన్‌ కింద పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-05-18T05:45:49+05:30 IST

మినుము పంటను నూర్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మిషన్‌ బోల్తా పడటంతో గోవిందమ్మ(45) అనే మహిళ కూలీ మృతి చెందింది.

నూర్పిడి మిషన్‌ కింద పడి మహిళ మృతి

  1. మరో ఇద్దరికి గాయాలు


పగిడ్యాల, మే 17: మినుము పంటను నూర్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మిషన్‌ బోల్తా పడటంతో గోవిందమ్మ(45) అనే మహిళ కూలీ మృతి చెందింది. పగిడ్యాల గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామ సమీపంలోని ఓ రైతుకు చెందిన మినుము పంటను నూర్పిడి చేసేందుకు ఉదయం గోవిందమ్మ, సరోజ, శేషమ్మలతో పాటు మరో ఐదుగురు కూలీలు పొలానికి వెళ్లారు. పంటను నూర్పిడి చేసిన అనంతరం కూలీలు ట్రాక్టర్‌ మిషన్‌పై కూర్చొని ఇంటికి బయలు దేరారు. పాత ప్రాతకోట సమీపంలోని పుల్యాల డ్యామ్‌ వద్ద ఉన్న మలుపు వద్ద డ్రైవర్‌ నాగశివుడు అతివేగంతో నడపడం వలన నూర్పుడు మిషన్‌ బోల్తా పడటంతో గొవిందమ్మ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటనలో సరోజ, శేషమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు పీఎ్‌సఐ రిజ్వాన్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:45:49+05:30 IST