గొడవ జరగడంతో..
ABN , First Publish Date - 2021-02-26T05:33:27+05:30 IST
మండల పరిధిలోని తవిశికొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ (34) కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందిందని హెడ్‌కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపారు.

బేతంచెర్ల, ఫిబ్రవరి 25: మండల పరిధిలోని తవిశికొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ (34) కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందిందని హెడ్‌కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపారు. బనగానపల్లె మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మతో తవిశికొండ గ్రామానికి చెందిన బాలరంగడుతో వివాహమైంది. ఈ నెల 23న భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో వెంకటేశ్వరమ్మ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారని ఆయన తెలిపారు. వెంకటేశ్వరమ్మ తల్లి నక్కల వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.