మహిళ హత్య

ABN , First Publish Date - 2021-11-03T05:20:51+05:30 IST

గూడూరు పట్టణంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి ఓ మహిళన హత్య చేశాడు.

మహిళ హత్య

గూడూరు, నవంబరు 2: గూడూరు పట్టణంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి ఓ మహిళను హత్య చేశాడు. పడమర బీసీ కాలనీలో నివాసం ఉంటున్న వీరమ్మ(28)ను సంజీవయ్య నగర్‌లో ఉంటున్న శేఖర్‌ అనే వ్యక్తి హత్య చేశాడు. ఎస్‌ఐ వెంకటనారాయణ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరమ్మకు సి.బెళగల్‌ మండలం కోత్తకోట గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే పిల్లలు కలగకపోవడంతో దంపతుల మధ్య గొడవ పడి దాదాపు పది సంవ త్సరాల క్రితం గూడూరు వచ్చి తమ్ముళ్లతో పాటు  కూలీ పనులు చేసుకోంటూ జీవనం సాగిస్తోంది. వీరమ్మ ఇంటి వద్దకు ఇతరులు వస్తున్నారన్న కారణంతో శేఖర్‌ వీరమ్మను చేతితో కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరమ్మ తమ్ముడు వీరేష్‌ ఫిర్యాదు కేసు నమెదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. Updated Date - 2021-11-03T05:20:51+05:30 IST