చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-20T05:19:57+05:30 IST

చికిత్స పొందుతూ మంగళవారం ఓ మహిళ మృతి చెందింది.

చికిత్స పొందుతూ మహిళ మృతి

ఆదోని రూరల్‌, అక్టోబరు 19: చికిత్స పొందుతూ మంగళవారం ఓ మహిళ మృతి చెందింది. బసాపురం గ్రామానికి చెందిన శకుంతలమ్మ (50)కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒక కూతుర్ని కర్ణాటక రాష్ట్రం నారళ్లకు ఇచ్చింది. శనివారం కూతురిని చూసి సమీప బంధువుతో ద్విచక్ర వాహనంపై తిరిగి బసాపురానికి బయలుదేరింది. పెద్దహరివానం దగ్గర రోడ్డుపై గుంతలను తప్పించే క్రమంలో వెనుక కూర్చున్న ఆమె ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రగాయలు అయ్యాయి. కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T05:19:57+05:30 IST