వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-01T04:41:08+05:30 IST

వేధింపులు తాళలేక మండలంలోని పండ్లాపురం గ్రామానికి చెందిన సురేఖ(21) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

బనగానపల్ల్లె, అక్టోబరు 31: వేధింపులు తాళలేక మండలంలోని పండ్లాపురం గ్రామానికి చెందిన సురేఖ(21) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో ఆ బాధను తాళలేక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నందివర్గం ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. నిత్యం అనుమానంతో కుటుంబ సభ్యులు దామల జానకిరాముడు, వెంకటరాముడు, కనకమ్మ వేధించడమేకాక ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిందని తెలిపారు. ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి  చెందినట్లు వివరించారు. యువతి తల్లి సుశీలమ్మ ఫిర్యాదు మేరకు దామల జానకిరాముడు, వెంకటరాముడు, కనకమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-11-01T04:41:08+05:30 IST