భారీగా మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-04-17T04:46:56+05:30 IST

మండలంలోని గోర్లగుట్ట, గోవిందిన్నె గ్రామాలకు చెందిన పిడతల తిరుపాలు, గోపాల్‌గౌడ్‌ కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సీఐ పీటీ కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్‌ తమ సిబ్బందితో శుక్రవారం దాడులు చేశారు.

భారీగా మద్యం పట్టివేత

బేతంచెర్ల, ఏప్రిల్‌ 16: మండలంలోని గోర్లగుట్ట, గోవిందిన్నె గ్రామాలకు చెందిన పిడతల తిరుపాలు, గోపాల్‌గౌడ్‌ కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సీఐ పీటీ కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్‌ తమ సిబ్బందితో శుక్రవారం దాడులు చేశారు. రూ.1.70లక్షలు విలువైన 17 బాక్స్‌ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. గోర్లగుట్ట గ్రామానికి చెందిన పిడతల తిరుపాలు అనే వ్యక్తి కర్ణాటక నుంచి లారీ డ్రైవర్లు తెచ్చిన కర్ణాటక మద్యం 816 క్వార్టర్లు ఉన్న 17 బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ బాక్స్‌లను గోవిందిన్నె గ్రామానికి చెందిన గోపాల్‌గౌడ్‌ ఇంట్లో దాచి ఉంచినట్లు వాటిని ఎస్‌ఐ సురేష్‌ స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. 

 మండలంలోని కొలుములపల్లె గ్రామంలో నాటుసారా విక్రయిస్తున్న వెంకటరమణమ్మ అలియాస్‌ కర్రెక్క అనే మహిళను అరెస్టు చేసి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు బేతంచెర్ల హెడ్‌కానిస్టేబుల్‌ బీవీ రమణ తెలిపారు. కొలుములపల్లె గ్రామంలో నాటుసారా విక్రయాలుకొనసాగుతున్నాయనే సమాచారం మేరకు సారా విక్రయ స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు. వెంకటరమణమ్మను విచారించగా బుగ్గానిపల్లెతండాకు చెందిన ధర్మనాయక్‌ తనకు సరఫరా చేస్తున్నాడని చెప్పడంతో అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. 

కర్నూలు(అర్బన్‌): తెలంగాణ నుంచి జిల్లాలోని ప్రవేశిస్తున్న అక్రమ మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రత్యేక బృందం సీజ్‌ చేసింది. శుక్రవారం జాతీయ రహదారిలోని ఆర్టీవో చెక్‌పోస్టు వద్ద సూపరింటెండెంట్‌ సుధాకర్‌, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ జానకీరామ్‌ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐలు వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో తరలిస్తున్న 11బాక్సుల్లో 132 బాటిళ్లను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ సోమశేఖర్‌, సిబ్బంది నరసింహ, నరసింహారెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. 

గోనెగండ్ల: గోనెగండ్ల, అగ్రహారం గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన బోయ క్రిష్ట, అగ్రహారం గ్రామానికి చెందిన బోయ సురేంద్ర, బోయ గోవింద్‌ కర్ణాటక మద్యాన్ని అమ్ముతున్నారన్న సమాచారంలో దాడి చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-04-17T04:46:56+05:30 IST