ఎప్పుడు స్పందిస్తారు?
ABN , First Publish Date - 2021-12-09T05:35:33+05:30 IST
‘జనాలు చచ్చాకనా మీరు స్పందించేది?’ అని విద్యుత శాఖాధికారులపై మండల ఉపాధ్యక్షుడు చినబాబు, పేరుసోముల సర్పంచ శృతి మండిపడ్డారు.

- విద్యుత శాఖాధికారులపై ఆగ్రహించిన సభ్యులు
- సర్వసభ్య సమావేశంలో స్పందించిన ప్రజాప్రతినిధులు
సంజామల, డిసెంబరు 8: ‘జనాలు చచ్చాకనా మీరు స్పందించేది?’ అని విద్యుత శాఖాధికారులపై మండల ఉపాధ్యక్షుడు చినబాబు, పేరుసోముల సర్పంచ శృతి మండిపడ్డారు. బుధవారం సంజామల స్ర్తీ శక్తి భవనంలో తొలిమండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ అధ్యక్షతన ఏర్పాటు అయిన సమావేశంలో ముఖ్య అతిఽఽథిగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సమస్యలను సభ్యులు వినిపించారు. పేరుసోముల ఎస్సీ కాలనీలో విద్యుత తీగలు కిందికి వేలాడుతున్నాయని, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని పేరుసోముల సర్పంచ శృతి, మండల ఉపాధ్యక్షుడు చినబాబు సభలో ప్రస్తావించారు. విద్యుత ప్రమాదం జరిగి మనుషులు చనిపోయాక స్పందిస్తారా? అని నిలదీశారు. సర్పంచ రాజశేఖర్‌రెడ్డి వెలుగులో అక్రమాలు జరిగాయని అధికారులను నిలదీశారు. ఆసరా, వైఎస్సార్ చే యూతలో పొదుపు మహిళలను అధికారులు దగా చేశారని ఆరోపించారు. ముదిగేడు, కమలపురి, సంజామల గ్రామాల్లో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలన్నారు. అనంతరం వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి తమ శాఖలో సాధించిన ప్రగతిని వివరించారు. రబీలో శనగ సాగు చేసి దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. 9456 మంది రైతులకు ప్రభుత్వం రైతు భరోసా అందించిందన్నారు. విద్యాశాఖకు సంబంధించి ఎంఈవో రఘురామిరెడ్డి వివరించారు. ఆర్‌అండ్‌బీ డీఈ సుధాకర్‌రెడ్డి వారి శాఖలో చేసిన పనులు, ప్రస్తుతం రూ.12 కోట్లతో ముదిగేడు నుంచి సంజామల వరకు డబుల్‌రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. పీఆర్‌ఏఈ బాషా మండలంలో 35 గ్రావెల్ రోడ్లు మంజూరయ్యాయన్నారు. 10 రోడ్లు పూర్తి చేశామన్నారు. తొలి సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ పోచా రమాదేవి మాట్లాడుతూ మండలాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగకుమార్, మండల ప్రత్యేకాధికారి మోహనరావు, తహసీల్దారు మల్లికార్జునరావు, డీఈలు సుధాకర్‌రెడ్డి, నాగశ్రీనివాసరెడ్డి, గౌరుగారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ముక్కమళ్ల సర్పంచ రమాదేవి, ఎగ్గోని సర్పంచ ముచ్చలపురి దొర, ముదిగేడు సర్పంచ రాజశేఖర్‌రెడ్డి, కానాల సర్పంచ పెద్దయ్య, ఆకుమళ్ల సర్పంచ పుల్లయ్య పాల్గొన్నారు.