పింఛన డబ్బులు పెంచేదెప్పుడు..?

ABN , First Publish Date - 2021-10-22T04:26:10+05:30 IST

పింఛన డబ్బులు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డి సీఎం జగనను ప్రశ్నించారు.

పింఛన డబ్బులు పెంచేదెప్పుడు..?
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి

 మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డి 


  కోవెలకుంట్ల, అక్టోబరు 21: పింఛన డబ్బులు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డి సీఎం జగనను ప్రశ్నించారు. పెంచిన విద్యుత చార్జీలకు నిరసనగా కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల, జోళదరాశి గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కలుగొట్ల గ్రామ నాయకులు అర్జునరెడ్డి ఆధ్వర్యంలో బీసీకి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహించిన సభలో బీసీ మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.3వేలు పింఛన ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాట మార్చారన్నారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుతామని చెప్పి రెండున్నరేళ్లు అయినా రూ.250 ప్రకారం పెంచలేద న్నారు. విద్యుత చార్జీలు  యూనిట్‌కు రూ.3 ఉండగా ప్రస్తుతం రూ.7వరకు పెంచి  పేదలను బాదుతున్నారన్నారు. గతంలో బనగానపల్లె మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో జగన్మోహనరెడ్డి హామీలను మైక్‌ ద్వారా వినిపించారు. 200 యూనిట్ల వరకు విద్యుతచార్జీలను పెంచనని చెప్పారన్నారు. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, 12 గంంటల పాటు టీవీలు చూసినా 200 యూనిట్లు దాటదని చెప్పి, ప్రస్తుతం విద్యుత చార్జీలను భారీగా పెంచి ప్రజల నడ్డీ విరిచారన్నారు. బనగానపల్లెలో ఇళ్లపట్టాలు ఇవ్వకుండా తాను అడ్డగించానని ఎమ్మెల్యే అంటున్నారని, మరి నియోజకవర్గంలోని మిగతా గ్రామాల్లో ఎన్ని గ ృహాలు నిర్మించారో చెప్పాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సవాలు విసిరారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే కలుగొట్ల గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేశామన్నారు. తమ ప్రభు త్వం అఽధికారంలోకి లేకపోయినా, తాను ఓడిపోయినా సొంత నిధులు వెచ్చించి గ్రామంలో మరో చోట మినరల్‌ వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని అందిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకు న్నా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు చీకటిగా ఉండవచ్చు గానీ, రేపు వైసీపీకి, వారి కార్యకర్తలకు ఖచ్చితంగా చీకటి రోజులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాను అధికారంలోకి ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించలేదన్నారు. ప్రస్తుత అధికారంలోకి ఉన్న నాయకులు పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. పోలీసులు కూడా వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తట్టుకోలేకపోతున్నారన్నారు. వైసీపీ పాలనలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, గతంలో వాటికే బిల్లులు రావడ లేదని, ఇప్పుడు చేస్తే ఏం వస్తాయని కొంతమంది వైసీపీ వారే చర్చించుకుంటున్నారన్నారు. కేవలం రూ.4వేల కోట్లకు ఆశపడి విద్యుత మోటార్లకు మీటర్లు బిగించేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడని విమర్శించారు.  విద్యుత చార్జీల వలన ప్రజలకు మాత్రమే కాక రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసేలేదనానరు. రివర్స్‌ టెండరింగ్‌తో అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిని రివర్స్‌కు మళ్లించారన్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రతి బిడ్డకు అందిస్తామని చెప్పి మోటారుసైకిల్‌, కరెంట్‌ బిల్లులు అంటూ సాకులు చెబుతూ ఎంతో మంది నిరుపేదలకు పథకాన్ని ఇవ్వకుండా ఎత్తివేశారన్నారు.  మాట తప్పిన ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు అమడాల మద్దిలేటి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన గడ్డం నాగేశ్వరరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు అభిరుచి మద్దిలేటి, లింగాల నాయుడు, చిన్నకొప్పెర్ల బుచ్చన్న, రేవనూరు నరసింహారెడ్డి, గుళ్లదుర్తి గోవర్దనరెడ్డి, పరమేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెలగటూరు ధనుంజయుడు, తిమ్మరాజు, రేవనూరు ఏవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-22T04:26:10+05:30 IST