వచ్చేది మన ప్రభుత్వమే

ABN , First Publish Date - 2021-12-29T05:14:40+05:30 IST

వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ డోన నియోజకవర్గ ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

వచ్చేది మన ప్రభుత్వమే
మాట్లాడుతున్న ధర్మవరం సుబ్బారెడ్డి

  టీడీపీ డోన ఇనచార్జి  ధర్మవరం సుబ్బారెడ్డి   


బేతంచెర్ల, డిసెంబరు 28: వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ డోన నియోజకవర్గ ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం బేతంచెర్లలో ఆయన మాట్లాడుతూ పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం రక్తాన్ని పీలుస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందామని సహనం కోల్పోవద్దని, గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని కార్యకర్తలకు పిలునిచ్చారు. వచ్చే మొదటి సారిగా బేతంచెర్లలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు దీటుగా టీడీపీ వార్డు కౌన్సిలర్లు నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తి వచ్చే ఎన్నికల్లో మనదే గెలుపన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరరాజు, కేవీ సుబ్బారెడ్డి, మధులోకేష్‌ రెడ్డి, వెంకటస్వామి, బుగ్గన బ్రహ్మానందరెడ్డి, రామక్రిష్ణ, మోహన, భూశన్న, రమేష్‌ ఇళ్లకు వెల్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డోన మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన మురళీకృష్ణగౌడు, టీడీపీ అధికార ప్రతినిధి విజయభట్టు, మండల టీడీపీ నాయకులు ఎల్లయ్య. తిరుమల చౌదరి, వార్డు కౌన్సిలర్‌ రామాంజనేయులు, వెంకట సాయి, రామగోపాల్‌, పిడతల రూబెన, రవీంద్ర నాయక్‌, వంశీకృష్ణ, నంద్యాల మదు, శివ పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి

డోన, డిసెంబరు 28: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ డోన నియోజకవర్గ ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కొండపేటలో టీడీపీ సీనియర్‌ నాయకుడు చీనిపండ్ల వెంకటేష్‌ మృతికి సుబ్బారెడ్డితో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, లక్ష్మినారాయణ యాదవ్‌ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టణంలోని పలువురు ప్రముఖులను కలిసి టీడీపీ అభవృద్ధికి సహకారాలు అందించాలని కోరురు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సామర్థ్యంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు తీసుకువచ్చారన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాకపోవడంతో యువత భవిష్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదన్నారు. పరామర్శించిన వారిలో కనపకుంట మధుసూదన రెడ్డి, కొచ్చెర్వు రామాంజినేయులు ఉన్నారు.


Updated Date - 2021-12-29T05:14:40+05:30 IST