ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరలించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-02T06:08:36+05:30 IST

ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు.

ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరలించాలి: ఎస్పీ

ఆళ్లగడ్డ, మే 1: ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. రోజురోజూకు కరోనా కేసులు పెరుగుతున్నాయని జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మాస్క్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు బౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్లు వినియోగించాలన్నారు. మాస్క్‌లు లేకుండా తిరిగే వారికి జరిమానా విధిస్తున్నామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాజేంద్ర, సీఐలు సుబ్రహ్మణ్యం, రాజశేఖరరెడ్డి, ఎస్‌ఐలు రామాంజనేయులు, వరప్రసాద్‌ ఉన్నారు. 

Updated Date - 2021-05-02T06:08:36+05:30 IST