ఆనలైనలో ఫిర్యాదులు స్వీకరిస్తాం

ABN , First Publish Date - 2021-09-02T05:57:46+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా బాధితులు కర్నూలులో ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర మానవ హక్కుల కమిషన చైర్మన జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి తెలియజేశారు.

ఆనలైనలో ఫిర్యాదులు స్వీకరిస్తాం
ఎస్‌హెచఆర్‌సీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న చైర్మన జస్టిస్‌ సీతారామ మూర్తి

  1.  ఎనహెచఆర్‌సీ చైర్మన జిస్టిస్‌ ఎం.సీతారామమూర్తి
  2. ప్రభుత్వ అతిథి గృహంలో కార్యాలయం ప్రారంభం


కర్నూలు(లీగల్‌), సెప్టెంబరు 1: రాష్ట్రంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా బాధితులు కర్నూలులో ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర మానవ హక్కుల కమిషన చైర్మన జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి తెలియజేశారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలోని 1, 2, 4 నెంబరు గదులలో కమిషన తాత్కాలిక కార్యాలయాలను చైర్మన జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ డి.సుబ్రహ్మణ్యం, నాన జ్యుడీషియల్‌ సభ్యులు జి.శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర విభజన తరువాత కమిషన తన కార్యకలాపాలను హైదరాబాదు నుంచే నిర్వహిస్తోంది. ఇకపై కర్నూలు నుంచి నిర్వహించనుంది. గత నెల 28న ఇదే అతిథి గృహం 3వ నెంబరు గదిలో లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఫిర్యాదులను ఆనలైన ద్వారా స్వీకరిస్తామని కమిషన చైర్మన తెలిపారు. అంతకుముందు చైర్మన, సభ్యులకు ప్రభుత్వ అతిథి గృహం వద్ద కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు రామసుందర్‌ రెడ్డి, శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఆర్‌డీవో హరిప్రసాద్‌, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిశేషు నాయుడు, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎం.సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కరీమ్‌, పలువరు న్యాయవాదులు పాల్గొన్నారు. 





Updated Date - 2021-09-02T05:57:46+05:30 IST