డ్రమ్ములతో తెచ్చుకుంటన్నారు..!

ABN , First Publish Date - 2021-05-30T05:53:41+05:30 IST

మండలంలోని కోతికొండలో తాగునీరు లేక పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న దుస్థితి ఏర్పడింది.

డ్రమ్ములతో తెచ్చుకుంటన్నారు..!
కోతికొండలో పొలం వద్ద డ్రమ్ముల్లో నీటిని పట్టుకుంటున్న గ్రామస్థులు

తుగ్గలి, మే 29: మండలంలోని కోతికొండలో తాగునీరు లేక పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న దుస్థితి ఏర్పడింది. గత రెండు రోజుల క్రితం గ్రామానికి తాగునీరు అందిస్తున్న పైపులైన్‌ పగిలిపోయింది. అధికారులకు తెలిపినా మరమ్మతులు చేయడంలో జాప్యం చేయడంతో తాగునీటి కోసం ఎద్దుల బండి, ఆటోలు, ద్విచక్రవాహనాలపై పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. ఇలాగే కొనసాగితే నీటి కోసం రోజంతా పొలం పనులకు వెళ్లకుండా రోజంతా ఎదురు చూడాల్సి వస్తుందని అన్నారు. వ్యవసాయ తోటలలో కరెంట్‌ ఉన్నప్పుడు మాత్రమే నీరు వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పైపులైన్‌లకు మరమ్మత్తులు చేసి దాహాం తీర్చాలని కోరుతున్నారు. Updated Date - 2021-05-30T05:53:41+05:30 IST