అల్పాహారం కోసం ఎదురుచూపు
ABN , First Publish Date - 2021-05-05T06:03:09+05:30 IST
ఎమ్మిగనూరు శివారున టిడ్కోగృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ వద్ద మంగళవారం నాటి పరిస్థితి ఇది.

ఎమ్మిగనూరు శివారున టిడ్కోగృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ వద్ద మంగళవారం నాటి పరిస్థితి ఇది. అల్పాహారం, భోజనం సరైన సమయానికి ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొవిడ్ కేర్ సెంటర్‌లో ఉంటున్న వారి భోజనానికి రోజుకు రూ.304 చొప్పున వెచ్చిస్తున్నారు. అయితే భోజనం సరఫరా చేసేవారు సమయం పాటించకపోవటంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలైనా అల్పాహారం రాకపోవడంతో బాధితులు ఇలా ఎదురు చూస్తున్నారు. సోమవారం కూడా అల్పాహారం ఆలస్యంగా తెచ్చారని, 40 మందికి తక్కువ వచ్చిందని బాధితులు తెలిపారు. తినని వారికి బయటి నుంచి కూడా తెచ్చివ్వలేదన్నారు.
- ఎమ్మిగనూరు