‘వేతనాలు చెల్లించాలి’

ABN , First Publish Date - 2021-06-23T05:13:12+05:30 IST

ప్రభుత్వ ఉర్దూ జూనియర్‌ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేస్తున్న అధ్యాపకులకు వేతనాలు చెల్లించాలని ఆల్‌మేవా గౌరవాధ్యక్షుడు అబులైస్‌, నంద్యాల డివిజన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇమ్రాపాషా, మహమ్మద్‌ సలీం విజ్ఞప్తి చేశారు.

‘వేతనాలు చెల్లించాలి’

నంద్యాల (ఎడ్యుకేషన్‌), జూన్‌ 22: ప్రభుత్వ ఉర్దూ జూనియర్‌ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేస్తున్న అధ్యాపకులకు వేతనాలు చెల్లించాలని ఆల్‌మేవా గౌరవాధ్యక్షుడు అబులైస్‌, నంద్యాల డివిజన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇమ్రాపాషా, మహమ్మద్‌ సలీం విజ్ఞప్తి చేశారు. మంగళవారం నంద్యాల ఆర్డీవో కార్యాలయ ఏవో హరినాథ్‌కు ఆల్‌మేవా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబులైస్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల నుంచి గెస్ట్‌ ఫ్యాకల్టీ అధ్యాపకులకు వేతనాలు చెల్లించకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. వేతనాలు చెల్లించకపోవడంతో అధ్యాపకులు కళాశాలకు వచ్చేందుకు ఇష్టంగా లేరని, దీని వల్ల విద్యార్థుల హాజరు తగ్గి ఉర్దూ విద్యార్థుల అభ్యున్నతికి కుంటుపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెస్ట్‌ ఫ్యాకల్టీల వేతనాలు మంజూరు చేయాలని, అధ్యాపకులను శాశ్వత ప్రాతిపదికన నియమించి ఉర్దూ భాషను కాపాడాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఆల్‌మేవా సభ్యులు ఆలీపీరా, సైపుల్లా, బేగ్‌, గౌస్‌, కాశీం పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:13:12+05:30 IST