రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ మృతి
ABN , First Publish Date - 2021-05-06T05:07:49+05:30 IST
పట్టణానికి చెందిన వీఆర్‌ఏ చాంద్‌బాషా(39) బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు.

పగిడ్యాల, మే 5: పట్టణానికి చెందిన వీఆర్‌ఏ చాంద్‌బాషా(39) బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. నందికొట్కూరుకు బైకుపై వెళ్లి తిరిగి వస్తుండగా బాదనమ్మ బావి సమీపంలోని స్పీడు బ్రేకర్ వద్ద అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చాంద్ బాషాకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూర్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.