నామినేషన్‌ కేంద్రాల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-06T05:12:44+05:30 IST

పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్‌ఐ చంద్రబాబు తెలిపారు.

నామినేషన్‌ కేంద్రాల పరిశీలన
బ్రాహ్మణకొట్కూరులో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్‌ఐ

నందికొట్కూరు రూరల్‌, జనవరి 5: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్‌ఐ చంద్రబాబు తెలిపారు. బ్రాహ్మణకొట్కూరులోని నామి నేషన్‌ కేంద్రాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో 12 గ్రామ పంచాయతీలకు మూడుచోట్ల నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొణిదేల గ్రామ సచివాయంలో కొణిదేల, నాగటూరు, బిజినవేముల గామాలవారు, అల్లూరు గ్రామ సచివాయల యంలో అల్లూరు, శాతనకోట, మల్యాల, వడ్డెమాను, కోనేటమ్మపల్లి గ్రామాల వారు, బ్రాహ్మణకొట్కూరు గ్రామ సచివాలయంలో బ్రాహ్మణ కొట్కూరు, దామగట్ల, 10 బొళ్ళవరం, కోళ్ళబావాపురం గ్రామాల వారు నామినేషన్లు వేసేందకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. మండలంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలు, సమస్యాత్మకంగా వున్నగ్రా మాల లో గట్టినిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలకు ప్రజలను గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


పగిడ్యాల: పంచాయతీ ఎన్నికల సామగ్రి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంది. గ్రామాల్లో శనివారం నుంచి సర్పంచ్‌, వార్డు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరింస్తుండటంతో ఎన్నికల సామగ్రిని ఈవోఆర్డీ ఫకృద్దీన్‌, సిబ్బంది పరిశీలించారు. గ్రామ పంచాయతీల వారిగా ఓటరు జాబితా, రూట్‌ మ్యాప్‌ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేశారు.


కోవెలకుంట్ల: త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోవెలకుంట్ల మండలం లోని గుళ్లదుర్తి గ్రామంలోని నామినేషన్‌ కేంద్రాన్ని, కోవెలకుంట్ల సచివాలయంలోని నామినేషన్‌ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆర్‌వోలకు సూచించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ లను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి ఎన్నికల్లో ఎలాంటి అవకతవలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.


పాణ్యం: పాణ్యంలోని నామినేషన్‌ కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శేషగిరి బాబు పరిశీలించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ ల పత్రాలు, రిజర్వేషన్‌ల వివరాలు పరిశీలించారు. ఎన్నికల అధికారి దస్తగిరి, తహసీల్దారు రత్నరాఽధిక, సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు, పంచాయతీ కార్యదర్శి అనూరాధ, ఆర్వో పాల్గొన్నారు


నంద్యాల (ఎడ్యుకేషన్‌): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ శేషగిరిబాబు ఆదేశించారు. శుక్రవారం నంద్యాల మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 సంబంధించిన పోలింగ్‌ అధికారులకు జరుగుతున్న శిక్షణా తరగతులను శేషగిరిబాబుతో పాటు జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సందర్శించి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని పోలింగ్‌ కేంద్రాలలో సౌకర్యాలు మెరుగ్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం నంద్యాల మండల పరిధిలోని చాబోలు గ్రామం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్‌ కేంద్రాన్ని, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. వీరి వెంట నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి, నంద్యాల డివిజన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ భాస్కర్‌, డివిజన్‌ పంచాయతీ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్‌ రవికుమార్‌, తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-02-06T05:12:44+05:30 IST