భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం

ABN , First Publish Date - 2021-08-21T05:27:22+05:30 IST

పట్టణంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం
ఆదోని ఉప్పర వీధి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు

ఆదోని(అగ్రికల్చర్‌), ఆగస్టు 20: పట్టణంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మి దేవిని ఇళ్లలో ప్రతిష్ఠించి పూజలు చేపట్టారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఉప్పర వీధిలోని లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.


పట్టు వస్త్రాలతో అమ్మవారికి అలంకరణ

గోనెగండ్ల/కౌతాళం, ఆగస్టు 20: శ్రావణ శుక్రవారం పురష్కరించుకొని మహిళలు వరలక్ష్మి వ్రతం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూలతో అలంకరించారు. కుంకుమార్చన, మహా మంగళ హారతి కార్యక్రమాన్ని వీరశైవమఠం పీఠాధిపతి శివయ్య స్వామి నిర్వహించారు. అలాగే కులుమాల పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కౌతాళం మండలంలో కూడా ప్రత్యేక పూజలు జరిగాయి.

Updated Date - 2021-08-21T05:27:22+05:30 IST