భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం

ABN , First Publish Date - 2021-08-21T05:14:49+05:30 IST

శ్రావణ మాసం.. రెండో శుక్రవారం.. వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారికి ప్రియమైన రోజు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం
మహానందిలో...

బండి ఆత్మకూరు, ఆగస్టు 20: శ్రావణ మాసం.. రెండో శుక్రవారం.. వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారికి ప్రియమైన రోజు. మహిళలందరూ అమ్మవారి కరుణ కోసం వ్రతం చేసే పవిత్రమైన దినం. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించారు.  ఆలయాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు ఉదయాన్నే తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లికలతో అలంకరించి అమ్మవారికి  ఆహ్వానం పలికారు. తలంటు స్నానాలు ఆచరించి, ఆలయాల్లో, ఇళ్ళలో వరలక్ష్మి పూజలు చేశారు. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చారు.  బండి ఆత్మకూరులోని ఆలయాలు శోభాయమానంగా కనిపించాయి.   Updated Date - 2021-08-21T05:14:49+05:30 IST