‘వాజ్‌పేయి జీవితం భావితరాలకు ఆదర్శం’

ABN , First Publish Date - 2021-12-26T05:59:08+05:30 IST

దివంగత మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి జీవితం భావితరాలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తూము శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ అన్నారు.

‘వాజ్‌పేయి జీవితం భావితరాలకు ఆదర్శం’

నంద్యాల టౌన్‌, డిసెంబరు 25: దివంగత మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి జీవితం భావితరాలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తూము శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన మహానీయుడు వాజ్‌పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రనాయుడు, భగవాన్‌, రజాక్‌, పుల్లారెడ్డి, బొమ్మిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, రామారావు, పురుషోత్తం పాల్గొన్నారు. Updated Date - 2021-12-26T05:59:08+05:30 IST