వ్యాక్సిన్‌ వేయించుకోవాలి: డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-10-22T05:28:04+05:30 IST

జిల్లాలో అర్హులంతా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీఎం హెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య పిలుపునిచ్చారు.

వ్యాక్సిన్‌ వేయించుకోవాలి: డీఎంహెచ్‌వో
క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య, సిబ్బంది

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 21: జిల్లాలో అర్హులంతా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీఎం హెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా వంద కోట్ల కొవిడ్‌ డోసుల మార్క్‌ను నమోదు చేసుకున్న సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కలెక్టరేట్‌ ఎదుట క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. దేశంలో వంద కోట్ల మార్కును అధిగమించడం గొప్ప విషయమని, వ్యాక్సిన్‌ వల్ల జిల్లాలో కొవిడ్‌ అదుపులోకి వచ్చిందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 36 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామని, వ్యాక్సిన్‌ 74 శాతంగా నమోదైందని తెలిపారు. ఇక నుంచి వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై ప్రత్యేక దృష్టి పెడుతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనేజేషన్‌ అధికారి  డా.విశ్వేశ్వరరెడ్డి, డెమో రఘురాం, డిప్యూ టీ డెమో ప్రకాష్‌ రాజ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పద్మా వతి, హెల్త్‌ సెక్రటరీలు, ఆశాలు పాల్గొన్నారు.

- అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాల యజమానులు గర్భిణులు ఫారం-ఎఫ్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పంపించాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ఆదేశించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అన్ని స్కానింగ్‌ కేంద్రాల యజమాన్యాలతో  జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. అల్ర్టా సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాలు పీసీపీఎన్‌డీటీ పోర్టల్‌లో ఫారం-ఎఫ్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయా లన్నారు. పీసీపీఎన్‌డీటీ పోర్టల్‌ ఫారం- ఎఫ్‌ చేసే విధానాన్ని డీఎంహెచ్‌వో వివరించారు. ఇక నుంచి ఫారం-ఎఫ్‌లను భౌతికంగా స్వీకరించరాదని డెమో రఘురాంను డీఎంహెచ్‌వో ఆదేశించారు. జూమ్‌ మీటింగ్‌లో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.వినోద్‌ కుమార్‌, ఆదోని, నంద్యాల డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:28:04+05:30 IST