ఎయిర్‌పోర్టులో మొదటి డోసు వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-05-21T05:31:35+05:30 IST
ఓర్వకల్లు గ్రామ సమీపాన ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టులో కలెక్టర్ వీర పాండియన్ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కైలాష్ మాండల్ ఆధ్వర్యంలో గురువారం మొదటి డోసు వ్యాక్సిన్ వైద్యసిబ్బందికి వేశారు.

ఓర్వకల్లు, మే 20: ఓర్వకల్లు గ్రామ సమీపాన ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టులో కలెక్టర్ వీర పాండియన్ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కైలాష్ మాండల్ ఆధ్వర్యంలో గురువారం మొదటి డోసు వ్యాక్సిన్ వైద్యసిబ్బందికి వేశారు. ఎయిర్‌పోర్టులో పని చేసే ప్రతి ఉద్యోగి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి టీకా వేస్తున్నట్లు కైలాష్ మాండల్ తెలిపారు. ఎయిర్‌పోర్టులో మొత్తం విధుల్లో 85 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 45 మంది ఉద్యోగులకు మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హుశేనాపురం హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పాల్గొన్నారు.